16 April, 2026 | 10:12 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

విజయ్ ఆంటోని మేకింగ్ చాలా ఇష్టం

27-06-2025 12:01 AM

విజయ్ ఆంటోని నటిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తున్న తాజాచిత్రం ‘మార్గన్’. లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ పేరుతో మూవీ యూనిట్ గురువారం హైదరాబాద్‌లో ఓ ఈవెంట్‌ను నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో సురేశ్‌బాబు మాట్లాడుతూ.. “విజయ్ ఆంటోనికి సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉంది. అలాంటి వారు తీసే చిత్రాల్ని చూసేందుకు ఇష్టపడుతుంటా. అందుకే నేను ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నా” అన్నారు. విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. “సురేశ్‌బాబు చాలా గొప్ప నిర్మాత. భవిష్యత్తులో ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నా. ఇది నార్మల్ సీరియల్ కిల్లర్ చిత్రంలా ఉండదు. చాలా లేయర్లు ఉంటాయి. నేను ఈ సినిమాకు సంగీతాన్ని అందించాను.

మా సోదరి కొడుకు అజయ్ ధీషన్ బిచ్చగాడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అతడ్ని ఈ సినిమాతో నటుడిగా పరిచయం చేస్తున్నా” అని తెలిపారు. అజయ్ ధీషన్ మాట్లాడుతూ.. “మార్గన్’ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా ఉంటుంది” అని చెప్పారు. బ్రిగిడ సాగా మాట్లాడుతూ.. “మార్గన్’లో తొలిసారి కాప్ రోల్‌లో కనిపిస్తున్నా” అన్నారు. దీప్శిఖ మాట్లాడుతూ.. “మార్గన్’ టీమ్‌తో పనిచేయడం వల్ల ఎంతో నేర్చుకున్నా” అని తెలిపారు. “127 నిమిషాల నిడివితో రాబోతోన్న ఈ చిత్రం ప్రతీక్షణం ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టదు” అని రైటర్ భాష్యశ్రీ అన్నారు.