16 April, 2026 | 11:55 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

నటిగా సంతృప్తి కలిగింది.. వర్జిన్ బాయ్స్‌తోనే!

26-06-2025 12:00 AM

మిత్రశర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమ్మాన్యుయెల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రల్లో రూపుదిద్దుకున్న చిత్రం ‘వర్జిన్ బాయ్స్’. దయానంద్ గడ్డం రచనా దర్శకత్వంలో రాజ్‌గురు బ్యానర్‌పై రాజా దారపునేని నిర్మిస్తున్నారు. జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలోని ‘డుం డిగా డుం’ పాట ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. “మంచి లవ్‌స్టోరీతో యూత్‌ఫుల్‌గా ఉండే ఈ సినిమా చూసినంతసేపు కాలేజీ రోజు గుర్తొస్తాయి” అన్నారు. నిర్మాత రాజా మాట్లాడుతూ.. “ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని ఎంతో కొనియాడారు.

ఆడవారు కూడా ప్రశంసించడం ప్రత్యేకంగా అనిపించింది” అన్నారు. నటి మిత్రశర్మ మాట్లాడుతూ... “వర్జిన్ బాయ్స్’ ద్వారా నేను పూర్తిగా నటిగా తృప్తి చెందాను. ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలను నేర్చుకున్నా” అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్ర మంలో నటీనటులు శ్రీహాన్, గీతానంద్, జెన్నీఫర్ ఇమ్మాన్యుయెల్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.