నేను చపాతీ కాలుస్తా..!
మహబూబాబాద్, మే 25 (విజయక్రాంతి): చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి పౌష్టికాహారం కీలకమని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ తెలిపారు. మరిపెడ మండలంలోని 99 రోజుల ప్రణాళికలో భాగంగా మరిపెడ ఆడిటోరియంలో నిర్వహించిన అంగన్వాడి వంటల కార్యక్రమంలో ఎమ్మెల్యే చపాతి కాల్చి, రొట్టెల్లో అనేక పోషక విలువలు ఉన్నట్లు వివరించారు. పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తు దృష్ట్యా నాణ్యమైన ఆహారం అందించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
మహిళా శిశు సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రతి అర్హులైన కుటుంబానికి చేరేలా కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందించే సేవల విషయం ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్వాడి టీచర్లు, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






