15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఏనాటికి నీ దరి చేరేనో!

24-11-2025 01:37 AM

నీ చిటికెన వేలు పట్టి దారంటా నడుస్తా ఉంటే నాకంటే నవాబు ఇంకెవరూ లేరనిపించేది వంట చేస్తూ నువ్వు  ‘జాజి మొగ్గల జాజి..’ అని పాడుతుంటే నాకు లాలిపడుతున్నట్లుండేది సంకురాతిరి రేతిరి నువ్వు వాకిట ముగ్గేస్తుంటే తెల్లటి సింగడి ఇంటిముంగట విరిసేది సలి గాడ్పు తగిలి  నేను వణికిపోతుంటే నే చేతి స్పర్శే నాకు వెచ్చదనం జ్వరమొచ్చినప్పుడు నువ్వు ఎల్లిపాయ కారం చేస్తే ప్రాణం జివ్వున లేచొచ్చేది ఉడుకుడుకు అన్నంలా ఆబగా కలుపుకుని తింటుంటే కళ్లెమ్మట చెమ్మ ఎదను తాకేది రెక్కలొచ్చిన పక్షిలా  సముద్రాలు దాటి నేను ఎగిరిపోతే ఇంటివద్ద దిక్కులేని పక్షిలా నువ్వు నీకు నాకు సప్త సముద్రాల దూరం అమ్మ గావురం కావాలనే ఆశలో నేను బండెడు బాధ్యతలు ఎత్తుకుని నీ తీరం చేరే నావలా నా పయనం ఏ నాటికి నీ దరిచేరేనో!