ఆఫీసర్స్ క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తా
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ, జూన్ 05 (విజయక్రాంతి): వరంగల్ ఆఫీసర్స్ క్లబ్లో చేపట్టనున్న పలు నూతన అభివృద్ధి పనులకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నా యిని రాజేందర్ రెడ్డి శుక్రవారం ముఖ్య అ తిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ ఆ ఫీసర్స్ క్లబ్ను మరింత ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసి సభ్యులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
క్లబ్ అభివృద్ధికి అవసరమైన మౌ లిక వసతుల కల్పనకు ఎల్లప్పుడూ సహకా రం అందిస్తామని పేర్కొన్నారు. క్లబ్ అభివృ ద్ధి పనులు పూర్తయిన అనంతరం సభ్యులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్య క్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్స్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.






