6 June, 2026 | 2:21 AM

వెయిట్ లిఫ్టింగ్‌లో సౌభాగ్యకు కాంస్యం

06-06-2026 01:17 AM

మహబూబాబాద్, జూన్ 5 (విజయక్రాంతి):.ఆల్ ఇండియా పోలీస్ స్పోరట్స్ మీట్ లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖకు చెందిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్య  కాంస్య పతకం సాధించింది. హర్యానా రాష్ట్రంలో నిర్వహించిన 3వ ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ (వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, యోగా) 2026,27 పోటీలలో మహబూబాబాద్ జిల్లా షీటీమ్లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ బి. సౌభాగ్య (డబ్ల్యూపీసీ 1692) విశిష్ట ప్రతిభ కనబరిచారు.

ఈ పోటీలలో నిర్వహించిన యోగా గ్రూప్ ఈవెంట్లో ఆమె కాంస్య పతకం సాధించి జిల్లా పోలీసు శాఖకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా మహిళా కానిస్టేబుల్ బి.సౌభాగ్య శుక్రవారం మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. క్రీడా రంగంలో విశేష ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో పతకం సాధించిన సౌభాగ్యను ఎస్పీ అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లా పోలీసు శాఖకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు.