15 April, 2026 | 10:07 AM

చిరు వ్యాపారులకు అండగా ఉంటా

20-11-2025 12:59 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): ఇందిరా పార్క్ సమీపంలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న పేదలకు ఎల్లవేళలా అండగా ఉంటానని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఇండిరాపార్క్ సమీపంలో వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులను లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు అక్కడి నుంచి తొలగించాలని సూచిస్తూ హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. అకస్మాత్తుగా జరుగుతున్న ఈ చర్యలపై ఆం దోళన చెందిన వ్యాపారులు  స్థానిక ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యను వివరించారు.

వ్యాపారుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్ బుధవారం స్వయంగా ఇండిరాపార్క్ వద్దకు చేరుకుని, సంబంధిత అధికారులను అక్కడికే పిలిపించి పరిస్థితిని సమీక్షించారు. ఈ కార్యక్ర మంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జై సింహ, దోమలగూడ ఇన్స్పెక్టర్ అంజాద్ అలీ, ట్రాఫిక్ సీఐ వెంకటలక్ష్మి, జీహెచ్‌ఎంసి డిఈ సన్నీ, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ శ్యామ్ యాదవ్, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.