27 July, 2026 | 7:46 PM

Breaking News

దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •   ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్   •   అశ్వాపురంలో గంజాయి పట్టివేత   •   ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్ట్ మంజూరు చరిత్రాత్మకం   •  

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆశయాలు యువతకు స్ఫూర్తి

27-07-2026 07:08 PM

మేడ్చల్  జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్

ఘట్ కేసర్,(విజయక్రాంతి): భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలను సోమవారం ఏదులాబాద్ డివిజన్ పరిధిలోని ఘనపూర్ లో ఘనంగా నిర్వహించారు.  డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామల అమర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ స్థానిక నాయకులతో  కలిసి అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్  మాట్లాడుతూ... డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం  దేశాభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత శాస్త్రవేత్త, ఆదర్శ రాష్ట్రపతి అని కొనియాడారు. భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.