డైలీ వేజ్ వర్కర్ల సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి
ట్రైబల్ వెల్ఫేర్ డీడీ చందన
భద్రాచలం టౌన్, ఆగస్టు 3 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్ల సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకొని వస్తే సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తానని ట్రైబల్ వెల్ఫేర్ డిడి చందన సూచించారు.
సోమవారం భద్రాచలం ఐటీడీఏ సమావేశం మందిరంలో నూతనంగా డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారినిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని డైలీ వేజ్ వర్కర్ల సంఘం తరఫున ఆమెకు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా డైలీ వేజ్ వర్కర్లు పలు సమస్యలు ఆమె దృష్టికి తీసుకొని రాగా డైలీ వేజ్ వర్కర్లు చాలా శ్రమపడి కష్టంతో కూడిన పనులు చేస్తున్నారని, మీ కష్టానికి మీ శ్రమకు తగ్గట్టు పెండింగ్లో ఉన్న వేతనాలు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. డైలీ వేజ్ వర్కర్లకు సంబంధించిన ఏ సమస్య ఉన్న నేరుగా తన దృష్టికి తీసుకొని రావాలని యూనియన్ నాయకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రాజు, మహిళా అధ్యక్షులు రమకళ, సుజాత, ఉపాధ్యక్షులు తాటి ఉమా, కార్యదర్శి సోడియం బాబురావు, సహాయ కార్యదర్శి పూణ్యం సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.






