4 August, 2026 | 3:10 AM

ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ పూర్తి చేయాలి

04-08-2026 02:01 AM

నిర్మల్, ఆగస్టు 3 ( విజయ క్రాంతి): రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారముల డిజిటలైజేషన్ ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాదు నుంచి సోమవారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియ మొత్తాన్ని పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. ఎటువంటి తప్పులు దొర్లకుండా డిజిటలైజేషన్ చేపట్టాలన్నారు.

ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ( హేతుబద్ధీకరణ) ప్రక్రియలపై జిల్లాల వారిగా సమీక్షించారు. ఒకే కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓటు ఉంటే, వారిని ఒకే పోలింగ్ కేంద్రం కిందకు వచ్చేలా రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ) ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. ఒక కుటుంబానికి చెందిన ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నుంచి ఈ వీసీలో కలెక్టర్ భవేశ్ మిశ్రా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డిఆర్‌ఓ రాథోడ్ రమేష్, ఆర్డీఓ దేవీదాస్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.