4 August, 2026 | 3:10 AM

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

04-08-2026 02:00 AM

జిల్లా కలెక్టర్ కె. హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, జులై 3 (విజయ క్రాంతి): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారితో కలిసి ఆమె అర్జీలు స్వీకరించారు.వివిధ మండలాల ప్రజలు తాగునీరు, 108 అంబులెన్స్, రోడ్డు మరమ్మతులు, భూమి హక్కులు, బకాయి చెల్లింపులు, బోర్వెల్ ఏర్పాటు, పట్టా మార్పిడి వంటి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.