దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రా
- మా ఎమ్మెల్యేలను లాక్కొని ప్రగల్భాలు పలకడం కాదు
- 2034 వరకు అధికారం మాదేనని పగటి కలలు కనొద్దు
- ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలం
- రైతులను నిండా ముంచిన సర్కార్
- మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట, జూన్ 28 (విజయక్రాంతి) : తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత వేడెక్కింది. నల్లగొండలో సీఎం రే వంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మా ఎమ్మెల్యేలను పార్టీలోకి లాక్కొని ప్రగల్భాలు పలకడం కాదు.. దమ్ముంటే వారితో రాజీనామా చేయించి ఎన్నికల బరిలోకి రా.. ప్రజలు ఎవరిని ఉప్పుపాతర వేస్తారో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. సీఎం తన పాలనపై నమ్మకం ఉంటే వెంటనే అ సెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు రా వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
2028, 2034 వరకు అధికారంలో ఉంటామని పగటి కలలు కనడం కాదు, సీఎం పద వికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రా అం టూ సూటిగా హెచ్చరించారు. సీఎం హోదా లో ఉన్న రేవంత్ రెడ్డి పరిపాలన గాలికి వదిలేసి, తన ఎత్తు, భౌతిక రూపం గురించి దిగ జారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిన్న కర్ణాటకలో ముగ్గురు సీఎంలతో జరిపిన మీటింగ్ ఏంటి? కృష్ణా, గోదావరి జలా ల్లో తెలంగాణ హక్కులు కాపాడారా? అని నేను సూటిగా ప్రశ్నిస్తే.. వాటికి సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి నల్లగొండ వెళ్లి నన్ను పరుష పదజాలంతో తిడుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. నువ్వు ఎ క్కడికి పోయినా బీఆర్‌ఎస్ ను, కేసీఆర్ను తిట్టకుండా ఉండలేకపోతున్నావు అంటే..
నీ కు కుర్చీ కదులుతోందన్న భయం పట్టుకుందని, నిద్రలో కూడా కేసీఆర్‌నే కలవరిస్తున్నావని ప్రజలకు అర్థమైపోయిందన్నారు. కాం గ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫల మైందని మండిపడ్డారు. ఆదివారం సిద్దిపేటలో జరిగిన పార్టీ (బీఎల్‌ఏ) బూత్ లెవెల్ అసిస్టెంట్స్ సమావేశంలో హరీశ్‌రావు మా ట్లాడారు. మహిళలకు రూ.2,500, స్కూటీ, తులం బంగారం, రూ.నాలుగు వేలు పెన్షన్, రెండు లక్షల ఉద్యోగాలు, రైతుబంధు పెంపు వంటి హామీలపై మాట్లాడే ధైర్యం లేకే బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని ఆరోపిం చారు. రైతుబంధు, రుణమాఫీ, రైతు బీమా, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్ర భుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు.
రైతులకు దాదాపు రూ.29 వేల కోట్ల రైతుబంధు బకాయిలు పెట్టిందని, అ కాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదని అన్నారు. దేవుడి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయనందుకు, రైతు బీమా ఎగ్గొట్టినందుకు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వనందుకు రాష్ట్ర రైతాంగానికి నువ్వు చెంపలేసుకు ని క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుపై సీఎం చేసిన వ్యాఖ్యలను హరీశ్ రావు ఖండించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం 12 కిలోమీటర్ల వరకు పనులు పూర్తి చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో 12 మీటర్లు కూడా తవ్వలేకపోయిందని, పైగా ఎనిమిది మంది కార్మికుల ప్రాణాలు బలితీసుకుందని ఆరోపించారు. సింగరేణి టెండర్ల గురించి కూడా నల్లగొండ మీటింగ్‌లో రేవంత్ పచ్చి అబద్ధాలు ఆడాడు. అసలు టెండరే కాలేదని బుకాయిస్తున్నాడు. సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇచ్చి, నీ బావమరిది సృజన్ రెడ్డికి చెందిన శోధా కన్స్ట్రక్షన్కు టెండర్ కట్టబెట్టింది నిజం కాదా? దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టు నేను రుజువు చేస్తానని హరీశ్‌రావు పేర్కొన్నారు. మూసీని శుద్ధి చేస్తా, మూసీలో నీళ్లు పోస్తా అంటున్నావు.. ఆ నీళ్లు ఎక్కడివి? కేసీఆర్ కట్టిన కాళేశ్వరం, మల్లన్న సాగర్ నీళ్లే కదా మూసీకి పోతున్నది.
కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధాలు చెబుతూనే, సిద్దిపే టలో పంటలు పండిస్తున్న అదే కాళేశ్వరం నీళ్లతో హైదరాబాద్‌కు మంచి నీళ్లు ఇస్తున్నావు అని అన్నారు. తెలంగాణ ఉద్యమ త్యాగాలపై మాట్లాడే నైతిక హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదని, ఉద్యమ సమయంలో తాము జైలు జీవితం గడిపి 300 కేసులు ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టి, సోనియాను బలిదేవత అన్న వ్యక్తి తెలంగాణ త్యాగాల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందన్నారు. ఎన్ని కేసులు పె ట్టినా, ఎంత ఇబ్బందులు పెట్టినా తెలంగాణ హక్కుల కోసం బీఆర్‌ఎస్ పోరా టం ఆగదనీ, సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అ డుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.






