09-12-2025 12:32:06 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): సర్పంచ్ ఎన్నికల్లో పోటీలో నుంచి తప్పుకోకపోతే చంపేస్తామంటు ఓ ట్రాన్స్ జెండర్ని ప్రత్యర్థి అభ్యర్థి బెదిరించిన సంఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో చోటుచేసుకుంది. జైనూర్ మండలం మార్లవాయి గ్రామ పంచాయితీలో జరుగుతున్న మొదటి విడుత సర్పంచ్ ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ సాధన (సంతోష్) నామినేషన్ వేశారు. ఈమె నామినేషన్ను విత్ డ్రా చేసుకోవాలని మొదట ఒత్తిడి తెచ్చారు.
అయినా సాధన భయపడకుండా నామినేషన్ విత్‌డ్రా చేసుకోలేదు. ఈమె వేసిన నామినేషన్ను పరిశీలించిన అధికారులు ఎన్నికల్లో గుర్తుని కూడా కేటాయిం చారు. దీంతో సాదన ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారాన్ని చేస్తుండటంతో ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. దీనికి చూసిన ప్రత్యర్థి అభ్యర్థులు ఈమెను ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారు. ఈమె ప్రచా రం కోసం అంటించిన పోస్టర్లను, బ్యానర్లను చింపివేస్తున్నారని, ఎన్నికల్లో ప్రచారం చేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ప్రత్యర్థి అభ్యర్థుల నుంచి వస్తున్న బెది రింపు కాల్స్ గురించి జైనూర్ ఎస్సై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఎస్సై తననే తిట్టి పంపించివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తనకు ప్రత్యర్థి అభ్యర్థి నుంచి తనను చంపుతామని వస్తున్న బెదిరింపు కాల్స్ గురించి తన వద్ద రికార్డులు కూడా ఉన్నాయని తెలిపారు. తను ప్రచారం చేయకుండా భయ బ్రాంతుల కు గురిచేస్తున్న వారిపై జిల్లా కలెక్టర్ తోపాటు, ఎస్సీకి ఫిర్యాదు చేసినట్లు సర్పంచ్ అభ్యర్థి సాధన (ట్రాన్స్ జెండర్ ) తెలిపారు.