11 May, 2026 | 11:39 AM

Breaking News

యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •   అర్ధరాత్రి అమానుషం.. పోలీస్ కానిస్టేబుల్ హత్య   •   ORRపై రోడ్డు ప్రమాదం: నలుగురికి తీవ్రగాయాలు   •  

గ్రామాల అభివృద్ధికి రూ.60 లక్షలు మంజూరు

17-03-2026 06:21 PM

బచ్చాయిపల్లి, సీతారాంపల్లిలో అభివృద్ధి పనుల ప్రారంభం

సిద్దిపేట రూరల్: గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.60 లక్షల నిధులు మంజూరు చేసిందని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ తెలిపారు. సోమవారం సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని బచ్చాయిపల్లి, సీతారాంపల్లి గ్రామాల్లో అభివృద్ధి పనులను గ్రామ నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల ద్వారా బచ్చాయిపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి రూ.20 లక్షలు, డ్రైనేజీ నిర్మాణానికి రూ.30 లక్షలు, అలాగే సీతారాంపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించామని తెలిపారు. ఈ పనులకు భూమిపూజ నిర్వహించినట్లు చెప్పారు.

సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రత్యేక నిధుల ద్వారా మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో గ్రామాలకు ఇంకా ఎక్కువ నిధులు తెచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలోమండల కాంగ్రెస్ అధ్యక్షులు గుర్రం అంజిరెడ్డి,సర్పంచ్ దుర్గం ప్రేమలత యాదగిరి, చింతల రత్నాకర్ గౌడ్ వార్డు సభ్యులు గుర్రం రాజశేఖర్ రెడ్డి, దుర్గం లక్ష్మీ రాజేశం, రామచంద్రం, యాదగిరి అనుపమ శ్రీనివాస్  కాంగ్రెస్ నాయకులు దేవిరెడ్డి రాజారెడ్డి, బాబురెడ్డి, శివ కుమార్,అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.