11 May, 2026 | 1:52 PM

Breaking News

మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •  

అల్లిపూర్ రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

17-03-2026 06:29 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ రైతు వేదికలో మంగళవారం నేచురల్ ఫార్మింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నోడల్ అధికారి కాంతారావు, వ్యవసాయ అధికారి పైడితల్లి, సహాయ వ్యవసాయ అధికారి రవితేజ, అలీపూర్ సర్పంచ్ సాయికిరణ్ హాజరయ్యారు.

మియ్యాపూర్ క్లస్టర్‌కు చెందిన చిన్నబొంకూరు, రెబ్బలదేవిపల్లి గ్రామాల నుండి సుమారు 125 మంది రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు సహజ వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించారు.కృషి సఖీలు స్వప్న, మంజుల సమన్వయంతో రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు, ఎన్ఎంఎన్ఎఫ్ కిట్లు పంపిణీ, భూసార పరీక్ష కార్డులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు రైతులను సహజ వ్యవసాయం వైపు మళ్లి, ఖర్చులను తగ్గించుకొని, భూమి సారాన్ని పెంచుకోవాలని సూచించారు.