09-12-2025 12:32:14 AM
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 8, (విజయక్రాంతి):బిఆర్‌ఎస్ పార్టీ హయాంలోనే గ్రామీణ ప్రాంతాలు ఎంతగానో అభివృద్ధి చెందాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్చార్జి వన మా వెంకటేశ్వర పిలుపు నిచ్చారు.
సోమవారం చుంచుపల్లి మండల పరిధిలోని నం ద తండా అభ్యర్థి మాలోత్ బలరాం నాయక్ , చుంచుపల్లి తండా మాలోతు రాజా గ్రామపంచాయతీలో పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ విస్తృతంగా ప్ర చార కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి వనమా, వనమా రాఘవేంద్రరావు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీ హయాంలో నే గ్రామీణ ప్రాంతాలు ఎంతగానో అభివృద్ధి చెందాయన్నారు.
రాబోయే ఎన్నికల్లో కల్వకుంట్ల చంద్రశేఖర రావును తిరిగి ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు, నా యకులు పనిచేయాలని పిలుపు నిచ్చారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి బిఆర్‌ఎస్ పా ర్టీ గెలుపుతోనే సాధ్యపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి, నాయకులు బట్టు మంజుల, నవతన్ తదితరులు పాల్గొన్నారు.