ఐలమ్మ పోరాటం ఆదర్శం

26-09-2026 | 07:42pm

* జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే...

ఆదిలాబాద్, సెప్టెంబర్ 26, (విజయక్రాంతి) : తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ(Chakali Ilamma) 131వ జయంతి ఉత్సవాలను ఆదిలాబాద్(Adilabad) లో అధికారికంగా ఘనంగా నిర్వహించారు. శనివారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా(District Collector Rajarshi Shah), ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథులుగా హాజరై రిమ్స్ ఎదుట ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ... సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం కోసం వీరనారి చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఐలమ్మ ధైర్యం, పట్టుదల, ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటం చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష, బిసి, ఇతర సంఘాల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు,

మరిన్ని వార్తలు