13-09-2025 01:54:58 AM
చాలా ఏళ్ల పాటు సింగిల్‌గా ఉన్న తమన్నా భాటియా సినిమాల్లో లిప్‌లాక్ సీన్స్ చేసేందుకు కూడా ఇష్టపడలేదు. బాలీవుడ్ నటుడు విజయ్‌వర్మతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన ఈ మిల్కీ బ్యూటీ అతనితో మాత్రం ఘా టు ముద్దు సన్నివేశా ల్లో నటించింది. పెళ్లికి ముందే కొ న్నాళ్లు చెట్టాపట్టాలేసుకు తిరిగిన ఈ ఇద్దరూ తమ రొమాంటిక్ రిలేషన్‌ను సోషల్ మీడి యాలో షేర్ చేసుకుంటూ వచ్చారు. త్వరలోనే పెళ్లి చేసుకో బోతున్నారనే ప్రచారం జరిగిన కొన్ని రోజులకే ఈ ఇద్దరికీ బ్రేకప్ అ యింది. విజయ్‌వర్మ తో బ్రేకప్ తర్వాత తనకు కాబోయేవాడి విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నానని చెప్తోంది తమన్నా.
డియానా పెంటీతో కలిసి ‘డూ యూ వాన్నా పార్టనర్’ అనే అమెజాన్ ప్రైమ్ వీడియో షో చేసిన తమ న్నా తాజాగా మాట్లాడుతూ ‘స్నేహితులు ఎప్పుడూ కలిసి వ్యాపారం చేయకూడదని నమ్ముతాను నేను. అదే నమ్మకంతో నా ఫ్రెండ్స్, బిజినెస్ ప్లాన్స్ చేసినా నో చెప్పాను. కానీ డియానా, నన్ను ఒప్పించేదాకా వదిలి పెట్టలేదు..’ అంటూ చెప్పుకొచ్చింది. తమన్నా ఇంకా మాట్లాడుతూ తన లైఫ్ పార్ట్‌నర్ గురించి తెలిపింది.
‘నేను ఓ గొప్ప జీవిత భాగస్వామిగా మారడానికి ప్రయత్నిస్తున్నా. నాకొచ్చేవాడు ఎలా ఉండాలంటే.. గత జన్మలో ఏదో ఉన్న గొప్ప పు ణ్యం చేసి ఉంటేనే, నాలాంటిది దక్కిందని ఫీల్ అవ్వాలి. ఆ అదృష్టవంతు డు ఎవ్వడైనా కావ చ్చు. అతనికి సర్వస్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అలాంటి వాడు నా జీవితంలోకి వస్తే నా ప్రేమనంతా పంచుతా. దానికి కొంత సమయం పట్టొచ్చు’ అంటూ తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్‌మీడియాను షేక్ చేస్తున్నాయి.