calender_icon.png 13 September, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమల్ 237 సెట్టయ్యింది

13-09-2025 01:51:48 AM

కమల్‌హాసన్ ప్రస్తుతం తన రాబోయే సినిమా కో సం సిద్ధమవుతున్నారు. ‘కేహెచ్237’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉ న్న ఈ సినిమాకు ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్స్ అయిన అన్బరివ్ మాస్టర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ చి త్రానికి సంబంధించి షూటింగ్ ఆగస్టులోనే ప్రారంభం కావాల్సి ఉం ది. అనివార్య కారణాల వల్ల చిత్రీకరణ ప్రారంభించే విషయంలో జాప్యం నెలకొంది.

దీంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందో లేదోనన్న అనుమా నం కమల్ అభిమానుల్లో ఏర్పడింది. అయితే, తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి అధికారిక ప్రకటన రావటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. రచయిత శ్యా మ్ పుష్కరన్ ‘కేహెచ్237’ బృం దంలో చేరారన్న విషయాన్ని మేకర్స్ శుక్రవారం ప్రకటించారు. ప్రస్తు తం స్క్రిప్ట్ పని జరుగుతోందని, త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించనున్నామని కూడా టీమ్ తెలిపింది.