calender_icon.png 13 September, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇడ్లీకడై నుంచి మీరా వచ్చింది

13-09-2025 01:57:31 AM

ధనుష్, నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న కుటుంబ కథాచిత్రం ‘ఇడ్లీ కడై’. ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో యువ కథానాయిక శాలినీ పాండే ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అక్టోబర్ 1 థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమ వుతోందీ సినిమా. విడుదల సమయం సమీపిస్తుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. ఇందులో భాగంగా సినిమాలోని పాత్రధారులను పరి చయం చేస్తూ ప్రత్యేక పోస్టర్లు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సత్యరాజ్, నిత్యామీనన్ పోస్టర్లు మంచి స్పందన దక్కించుకోగా తాజాగా శాలినీ పాండే ‘మీరా’ అనే పాత్రలో నటిస్తున్నట్టు ప్రకటించారు.