పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు

11-09-2026 | 05:30am
  1. అధికారులు అనుకుంటే అక్రమ నిర్మాణం సక్రమమవుతుందా?  
  2. అనుమతి గోరంత.. కట్టడాలు కొండంత
  3. జడ్చర్ల మున్సిపాలిటీలో ఇష్టారాజ్యం
  4. అనుమతి లేని నిర్మాణాలు చేపట్టవద్దు.. జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ గిరీష్  

జడ్చర్ల సెప్టెంబర్ 10: అక్రమ నిర్మాణ లకు అడ్డగా జడ్చర్ల మున్సిపాలిటీ (Municipality) మారుతుందా? అధికారులు అనుమతులు ఉంటే సరిపోతుంది ప్రభుత్వ అనుమతులు ఎవరికి అక్కర్లేదు అనుకుంటున్నారా? ఇక్కడ కొన్ని భవనాల నిర్మాణం చూస్తే ఇది నిజమేనేమో అనిపించకుమారుదు.

అనుమతి కొంత అంతస్తు ఎంతైనా అనే నినాదంతో కొందరు ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు కట్టకుండా ఇష్టానుసారంగా భవనాలను నిర్మించుకుంటూ మాకు ప్రజా ప్రతినిధుల అండ ఉంది అనే రీతిలో వ్యవహరించడంతో సామాన్య ప్రజలు ఇదేంటి ఇలా తయారయింది జడ్చర్ల మున్సిపాలిటీ అనే చర్చ వుపందుకుంటుంది.

అనుమతి లేని నిర్మాణాలను అడ్డుకుంటే మున్సిపాలిటీ ఆదాయం పెరగడంతో పాటు పారదర్శకంగా నిర్మాణాలు జరుగుతాయి అందుకు తగ్గట్టు ప్రభుత్వ సదుపాయాలు కూడా అంతే అవకాశం ఉంటుందని ప్రజలు చెబుతున్నారు.

రెండంతస్తుల అనుమతి.. నాలుగు అంతస్తుల నిర్మాణమా?

కొన్ని ప్రాంతాల్లో రెండు అంతస్తులకు అనుమతి తీసుకుని, ఆపై నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల నివాస గృహాల పేరుతో అనుమతులు తీసుకుని అదే ప్రాంగణంలో వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలకు సంబంధించిన నిర్మాణాలు చేపడుతుండ్రు.అనుమతుల పరిశీలన, నిర్మాణాల పర్యవేక్షణ, నిబంధనల అమలు వంటి బాధ్యతలు ఉన్న టౌన్ ప్లానింగ్ విభాగం ఈ వ్యవహారాలపై ఏమి చేస్తోందన్నది ప్రశ్నార్థకంగా మారింది.

నోటీసులు ఇచ్చిన.. నిర్మాణాలు ఆగట్లే..

జడ్చర్ల మున్సిపాలిటీ నుంచి ఇప్పటికే మూడు నోటీసులు అందినట్లు చెబుతున్న ఓ భవన నిర్మాణం ప్రస్తుతం స్థానికంగా చర్చకు దారితీస్తోంది. నోటీసులు జారీ చేసిన రెండంతస్తుల నిర్మాణం కొనసాగుతున్నట్లయితే.. అధికారులు పనులను ఎందుకు నిలిపివేయలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ భవనానికి సెల్లార్ నిర్మిస్తున్న వ్యవహారం కూడా వివాదాస్పదంగా మారింది. నిర్మాణంపై మున్సిపల్ అధికారులు నోటీసు జారీ చేసినట్లు సమాచారం. నోటీసు వివరాలతో కూడిన ప్లెక్సీని భవనానికి ఏర్పాటు చేయగా అది అతికించిన గంటలోపే తొలగించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందే: గిరీష్, మున్సిపల్ కమిషనర్ జడ్చర్ల.

ఇప్పటికే నిర్మించిన భవనాలకు అదనపు అంతస్తులు నిర్మించాలన్నా, భవనాల్లో మార్పులు, విస్తరణలు చేపట్టాలన్నా ముందుగా మున్సిపాలిటీ నుంచి సంబంధిత అనుమతులు తప్పనిసరిగా పొందాలి. ఎలాంటి అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు, ఇతర నిర్మాణ పనులు చేపట్టడం నిబంధనలకు విరుద్దాం.

అనుమతులు లేకుండా  నిర్మాణాలు చేపడుతున్నట్లు గుర్తించినట్లయితే సంబంధిత చట్టాలు,మున్సిపల్ నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేయడంతో పాటు నిర్మాణ పనులను నిలిపివేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటం.

మరిన్ని వార్తలు