calender_icon.png 23 February, 2026 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోరుగా అక్రమ బోర్లు

23-02-2026 12:00:00 AM

  1. చోద్యం చూస్తున్నరెవెన్యూ అధికారులు
  2. వద్ద నిబంధనలకు విరుద్దంగా బోరు తవ్వకాలు
  3. సీతాఫలమండి మేడి బావి దగ్గర అరాచకం!

సికింద్రాబాద్, ఫిబ్రవరి 22 (విజయ కాంత్): సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫలమండి మేడిబావి వద్ద బూత్ బంగ్లా, ఊడలమర్రి స్థలం లో ఓ బిల్డర్ నిబంధనలకు విరుద్దంగా బోరింగ్ నిర్మాణం చేపట్టా రు. చాలా కాలంగా శిథాలావస్తలో ఉన్న ఓ బిల్డింగ్ ను ఇటీవల కూల్చివేసి ఆ స్థలంలో అపార్టుమెంట్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. అంతకు ముందుగానే ఆ స్థ లంలో లోతైన సెల్లార్ తవ్విన బిల్డర్ అందు లో రోబోటిక్ బోర్వెల్ వేస్తున్నా రెవెన్యూ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజల ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు.

సీతాఫల్మండి,పద్మారావు నగర్, వారసిగూడ,లాలాగూడ తదితర ప్రాంతాల్లో అక్రమంగా సెల్లారు,బోర్లు వెలుస్తున్నాయి. ఒక్క  బోరుకు అనుమతి తీసుకుని అదే అనుమతి లేటర్ చూపిస్తూ పది అక్రమ బోర్లు వేస్తున్నా  రెవెన్యూ అధికారులు నిమ్మ కు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే చాలా మం ది బిల్డర్లు  అనుమతులు పొందుకుండానే  సెలవురోజులు చూసుకుని ముఖ్యంగా శని, ఆదివారాల్లో  బోరింగ్ వేసే పనులు చేపట్టడం పరిపాటిగా మారింది. ఇదే క్రమంలో సీతాఫల్మండి మేడి బావి,

బూత్ బంగ్లా (ఊడలమర్రి) ప్రాంతంలో కూల్చివేసిన ఓ పురా తన భవనం ప్రాంతంలో అపార్టుమెంట్ నిర్మిస్తూ డొమెస్టిక్ బోర్ వేస్తున్నారు. కాగా రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈస్థలంలో  సెల్లార్ లాంటి భారీ గుంతను తవ్వి రక్షణకోసం ఎలాంటి రేకులు , కర్రలు కానీ అడ్డంగా కట్టకపోవడంతో ఈ మార్గంలో ప్రమాదం పొంచి ఉందంటున్నారు. ఈ మార్గం గుండా రాత్రి సమయాల్లో వెళ్లే వాహనదారులు  అదుపు తప్పి గుంతలో పడితే ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.

వాల్టా చట్టం ప్రకారం కమర్షియల్ బోరింగ్ వేసేందుకు కనీసం 600 చదరపు గజాల విస్తీర్ణం మించిన స్థ లం ఉండాలి. కానీ ప్రస్తుతం బోరింగ్ వేస్తు న్న స్థలం 300 చదరపు గజాలకు మించి లేదని స్థానికులు పేర్కొంటున్నారు.తెలంగాణ భూమి రెవెన్యూ చట్టం 1359 సెక్షన్ 9 ప్రకారం అక్రమ బోర్ సీజ్  చేయాలి.

సెక్షన్ 9(1) ప్రకారం వాల్టా చట్టం ప్రకారం అక్రమ బోర్లు వేసిన భూ యజమానులకు నీటిని వినియోగం చట్టం సెక్షన్ 9(1) ప్రకారం జరిమానాలు విధించవచ్చు.అక్రమ బోర్లు అనుమతి లేకుండా బోర్ వేసినట్లై రూ. 10,000/- నుంచి రూ.1,00,000/వరకు జరిమానాలు  విధించాలని,రెవెన్యూ అధికారులు దీనిపై స్పందించి అక్రమంగా బోరు నిర్మిస్తున్న బిల్డ్ప చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.