9 May, 2026 | 9:48 AM

అమెరికాకు తగ్గిన అక్రమ వలసలు!

03-03-2025 12:40 AM

‘ఎక్స్’లో ప్రకటించిన ప్రెసిడెంట్ ట్రంప్ 

వాషింగ్టన్, మార్చి 2: అమెరికా సరిహద్దుల్లో భారీ స్థాయిలో అక్రమ వలసలు తగ్గినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాను విధించిన కఠిమైన ఇమిగ్రేషన్ విధానాల వల్ల ఫిబ్రవరిలో దేశ చరిత్రలోనే అతి తక్కువ అక్రమ వలసల సంఖ్య నమోదైనట్టు పేర్కొన్నారు.

దాదాపు 95 శాతం వలసలు తగ్గాయని వివరించారు. గత నెల లో కేవలం 8,326 మంది అక్రమ వలసదారులు మాత్రమే దేశ సరిహద్దుల్లో పట్టుబడ్డ ట్టు తెలిపారు. బైడెన్ హయాంలో ప్రతినెలా మూడు లక్షల మంది అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేవారని ఆరోపించారు.