9 May, 2026 | 10:43 AM

Breaking News

కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం   •   నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •  

రంజాన్ వేళ.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య మరో ఒప్పందం

02-03-2025 02:01 PM

టెల్ అవీవ్,(విజయక్రాంతి): అత్యంత పవిత్రమైన రంజాన్‌ పర్వదినాన్ని పూరస్కరించుకొని ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఆదివారం మరో ఒప్పందం కుదిరింది. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపునకు ఇజ్రాయెల్ అంగీకారం తెలిపింది. రంజాన్ మాసం కావడంతో కాల్పుల విరమణ కొనసాగించాలని కోరిన అమెరికా ప్రతిపాదనకు ఇజ్రాయెల్ మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్-హమాన్ ల మధ్య తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం నిన్నటితో ముగిసింది. అయితే గాజా స్ట్రిప్‌లోకి అన్ని వస్తువులు, సామాగ్రి ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఈ నిర్ణయం గురించి వివరించలేదు కానీ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పొడిగింపుకు అమెరికా చేసిన ప్రతిపాదన అని చెప్పే దానిని హమాస్ అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. సహాయ సరఫరా పూర్తిగా నిలిపివేయబడిందా లేదా అనేది వెంటనే స్పష్టంగా తెలియలేదు. ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ మొదటి దశ, రెండవ దశ గురించి రెండు వైపులా ఇంకా చర్చలు జరగలేదు. దీనిలో ఇజ్రాయెల్ ఉపసంహరణ, శాశ్వత కాల్పుల విరమణకు ప్రతిగా హమాస్ డజన్ల కొద్దీ మిగిలిన బందీలను విడుదల చేయనుంది.