15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పీసా చట్టాలను పాతర

27-06-2025 01:56 PM
  1. రూ100కోట్ల ఇసుక అక్రమాలు
  2. కొందరికె ఆదివాసీ లబ్ది  
  3. అత్యధిక ఆదివాసీల అభివృద్ధి సంగతేంటి?
  4. పర్యావరణ విధ్వంసం ఆదివాసీ చట్టాల పాతరేసే కుట్ర మానుకోవాలి 
  5. మంత్రి సీతక్క గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటించాలి. ఉపాధికి దూరమైన ప్రజల గోడు వినాలి 
  6. ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఇరప.రాజు 

చర్ల, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా చర్ల మండలంలో ఆదివాసీ ప్రజల జీవన మనుగడకు కీలకమైన ఆదివాసీ చట్టాలను పాతరేసి ఇసుక అక్రమాలకు తెరలేపిన ప్రజా ప్రతినిధులకు, అధికారులకు తగిన బుద్ధి చెప్పాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఇరప.రాజు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ  ఆదివాసీ చట్టాలను సమాది చేసి షెడ్యూల్డ్ ట్రైబల్ (ST) నియోజకవర్గాన్ని జనరల్ చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అందులో భాగంగానే పీసా గ్రామసభలు, పీసా కమిటీలను, 1/70, ఎల్టిఆర్ చట్టాలను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఆదివాసీ సంపద అయినా ఇసుకను ఆంధ్ర కాంట్రాక్టర్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టబెట్టిందని ఆరోపించారు. అందులో బాగంగానే రూ 1000 కోట్ల  ఇసుక అక్రమాలు చర్ల మండలంలో జరుగుతున్నాయన్నారు. ఆదివాసీ సమాజం ఈ విషయాన్ని నిశితంగా గమనించాలని కోరారు. వెయ్యి మన జేబులో పెట్టి పది వేలు రైజింగ్ కాంట్రాక్టర్ ముసుగులో ఉన్న వ్యక్తులు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇందుకు కొందరి ఆదివాసీ ప్రజల అభివృద్ధిగా చూపెడుతూ అందరి అభివృద్ధి చిత్రికరిస్తున్నారని అన్నారు..

మంత్రి సీతక్క గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటించాలి

ఆదివాసీ ఆడబిడ్డ తెలంగాణ రాష్ట్ర మంత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటించాలనీ డిమాండ్ చేశారు. ఆదివాసీ చట్టాలు ఏ రకంగా విధ్వంసం అవుతున్నాయో కనులారా వీక్షించవచన్నారు. ఆదివాసీ సమాజం గోడు వీనే అదృష్టం సైతం వరిస్తోందన్నారు.. లేదని ఆదివాసీ ప్రజలకు అన్యాయం చేసిన వ్యక్తిగా మిగిలి పోవాల్సి వస్తుందని అన్నారు. త్వరలోనే ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రంలో గల ఆదివాసీ ఎమ్మెల్యేలను కలిసి భద్రాచలం నియోజకవర్గంలో జరుగుతున్న ఆదివాసీ చట్టాల ఉల్లంఘన గురించి వివరిస్తామని తదనంతరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరిస్తామని వెల్లడించారు.