27-06-2025 01:58:22 PM
బీసీ బాయ్స్ హాస్టల్లో కొనసాగుతున్న సోదాలు.
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి ): నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని బిసి బాయ్స్ హాస్టల్లో(BC Boys Hostel) శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. మహబూబ్నగర్ ఏసీబీ డీఎస్పీ(Mahabubnagar ACB DSP) సీహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో తనిఖీలు చేపట్టడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వసతి గృహాలలోని వార్డెన్లు ప్రతిరోజు తప్పనిసరిగా రికార్డులు నమోదు చేయాల్సి ఉంటుంది. 2024- 25, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అన్ని విషయాలను కూలంకుషంగా అధికారులు పరిశీలిస్తూ రికార్డులను తనిఖీ చేస్తున్నారు.