21 May, 2026 | 10:29 PM

యమునలో మునిగిన బీజీపీ చీఫ్‌కు అస్వస్థత

27-10-2024 12:43 AM

దవాఖానాలో చేరిన వీరేంద్ర సచ్‌దేవా

యమునా నది ప్రక్షాళనపై బీజేపీ, ఆప్ మధ్య వార్

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా అనారోగ్యానికి గుర య్యారు. చర్మంపై దద్దుర్లు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలతెత్తడంతో శనివారం ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు బీజేపీ వెల్లడించింది. యమునా నదిలో మునిగిన రెండు రోజులకే వీరేంద్ర అనారోగ్యానికి గురైనట్టు తెలిపింది. యమునా నదిని శుద్ధి చేసే విషయంలో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించింది. యమునా నది శుద్ధి విషయంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపేందుకు వీరేంద్ర గురువారం యమునలో మునిగారు. అనంతరం మాజీ సీఎం కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. 2025 నాటికి యమునను శుద్ధి చేస్తామంటూ కేజ్రీవాల్ మాటిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన తన మాట నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు.