20 March, 2026 | 3:20 AM

ట్రంప్ ప్రభంజనం.. దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు

06-11-2024 01:00 PM

వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠానికి చేరువలో ఉన్నారు. ట్రంప్ గెలుపు అవకాశాలతో స్టాక్ మార్కెట్లలో జోస్ పెరిగింది.  సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా లాభాల్లో కొనసాగుతుండగా, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా లాభాల్లో దూసుకుపోతుంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో ట్రంప్‌కు 270, హారిస్‌కు 248 ఎలక్టోరల్‌ ఓట్లు వచ్చాయి. మేజిక్‌ ఫిగర్‌ 270. అటు మరో ఆరు రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. కీలక స్వింగ్ రాష్ట్రాల్లో కూడా ట్రంప్ దే ఆధిపత్యం కనిపిస్తోంది. అమెరికా అధ్యక్ష పీఠం డోనాల్డ్ ట్రంప్ కైవసం చేసుకోనున్నారు.