22 March, 2026 | 1:56 AM

ఈ వారం వార్తల్లో..

22-03-2026 12:19 AM

ధురంధరుడు మాస్టర్ పీస్! 

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ప్రస్తుతం ‘ధురంధర్ 2: ది రివెంజ్’తో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించారు. ఇందులో రణవీర్ నటనను చూసి రాజమౌళి సైతం అంటూ ప్రశంసించారు. ఈ సినిమా కోసం ఆయన అండర్ వాటర్ స్టంట్స్ చేశారు. పూర్తి పేరు రణవీర్ సింగ్ భవ్నానీ. ముంబై సింధీ వ్యాపార కుటుంబంలో పుట్టారు. 2010లో ‘బ్యాండ్ బాజా బారాత్’ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

బ్రేవ్.. రాజ్‌నాథ్‌సింగ్

పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు రగులుతున్న వేళ భారత రక్షణశాఖ మంత్రి దేశ ప్రజలకు కీలకమైన సందేశమిచ్చారు. యుద్ధమంటే పొరుగు దేశం ఆర్థిక మూలాలను ధ్వంసం చేయడం. చమురు, ఎల్పీజీ ఆపి విపణి సామ్రాజ్యాన్ని కూల్చడం’ మని అభివర్ణించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి పౌరుడూ దేశ రక్షణలో ముందుకు రావాలని ఇచ్చిన పిలుపునకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది.