17 May, 2026 | 1:18 PM

ఔరంగజేబు కూతురు పాత్రలో..

14-02-2025 12:00 AM

విక్కీ కౌశల్, రష్మిక జంటగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్న బాలీ వుడ్ చిత్రం ‘ఛావా’. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. విక్కీ కౌశల్ శంభాజీగా, రష్మిక.. ఆయన భార్య ఏసుబాయిగా నటిస్తున్నారు. శివాజీ తదనంతరం మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని కలలు కంటున్న మొఘల్ వంశస్తుల పాలిట..

ఇంకా ముఖ్యంగా ఔరంగజేబు పాలిట శంభాజీ సింహ స్వప్నంగా ఎలా మారాడు.. తన సైనికులు, ప్రజల తో కలిసి ఎలాం టి పోరాటం చేశాడు.. తండ్రి కలలు కన్న స్వరాజ్యం కోసం ఏం చేశారనేదే ఈ సినిమా కథ. కాగా ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుండగా.. మేకర్స్ గురువారం ముఖ్య పాత్రలను పరిచయం చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేశారు.

ఈ పోస్టర్లు ఇప్పుడు నెట్టింట ప్రత్యేక ఆకర్షణగా మారాయి. రాజమాత సోయారాబాయి భోసలే పాత్రలో దివ్య దత్తా, సర్సేనాపతి హంబీరావ్ మోహతేగా జో చట్టన్ బంకర్, రాయజీగా సంతోష్ జువేకర్ కనిపించ నున్నారని వెల్లడించారు.  డయానా పెంటిని షెహజాది జినాత్- అన్ -నిస్సా బేగంగా పరిచ యం చేశారు. షెహజాది ఓ మొఘల్ యువరాణి. చక్రవర్తి ఔరంగ జేబు బాను బేగం దంపతుల రెండో కుమార్తె.