17 May, 2026 | 2:33 PM

ప్రేమంటేనే భయమేస్తోంది!

14-02-2025 12:00 AM

ఐశ్వర్య రాజేశ్ ఈ ఏడాది తెలుగులో చాలా పాపులర్ అయిన నటీమణుల్లో ఒకరు. ‘సంక్రాంతికి వస్తున్నాం’తో ఈ ఏడాది తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఈ ముద్దుగుమ్మ తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలు పంచుకుంది. ముఖ్యంగా తన రిలేషన్‌షిప్ బ్రేకప్ గురించి ఐశ్వర్య స్పందించారు.

“లవ్ కంటే అది బ్రేకప్ అయినప్పుడు వచ్చే బాధంటే నాకు చాలా భయం. చాలా ఎమోషనల్ అయిన నేను.. ప్రేమించే సమయం కంటే అది మిగిల్చిన బాధ నుంచి బయటకు వచ్చేందుకే ఎక్కువ సమయం తీసుకుంటా. గతంలో నేను రిలేషన్‌లో ఉన్నా. సినిమాల్లోకి రాక ముందు ఓ వ్యక్తిని ఇష్టపడ్డాను. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలోనూ ఓ వ్యక్తిని ఇష్టపడ్డాను.

ఇద్దరి నుంచి వేధింపులు ఎదుర్కొన్నా. రిలేషన్‌షిప్‌లో ఎందుకలా జరుగుతుందని భయ పడ్డా. అందుకే ఇప్పు డు ప్రేమంటేనే భయపడుతున్నా” అని ఐశ్వర్య తెలిపారు. వ్యక్తిగత జీవితం గురించి ఐశ్వర్య మాట్లాడుతూ.. “మా అమ్మే నాకు స్ఫూర్తి. మేము నలుగురు సంతానం.

చిన్నతనంలో నా తండ్రి చనిపోవడంతో అమ్మే ఎంతో కష్టపడి పెంచింది. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఆమెకు సాయంగా నిలిచేందుకే తొలి నాళ్లలో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేశాను. అనంతరం సినిమాల్లోకి అడుగు పెట్టాను” అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది.