8 July, 2026 | 9:43 PM

మీ డైట్‌లో ఇవి ఉన్నాయా!

13-05-2024 12:05 AM

ప్రతిరోజూ వ్యాయమానికి తోడు పోషకాహారం, ఆక్సిజన్ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి. రోజువారి ఆహారంలో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పోషకాహారలోపం ఈ మధ్య ఎక్కువవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ లోపాన్ని భర్తీ చేయాలంటే ఆక్సిజన్ రిచ్ ఫుడ్స్ మీ డైట్‌లో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలంటే...!

పాలకూర, పైనాపిల్, సీజనల్ ఫుడ్ మామిడిపండు, స్వీట్ పొటాటోస్, బీట్‌రూట్ వంటి ఆక్సిజన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందులో ఏ పోషకాలు ఉన్నాయో, వాటి వల్ల ఎటువంటి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.

పాలకూర  : యాంటీ ఆక్సిడెంట్‌లతో పాటు ఐరన్, విటమిన్లు పాలకూరలో పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో చురుకుగా పనిచేస్తాయి. ఒత్తిడి తగ్గించడంలో మెడిసిన్‌ల పాలకూర పనిచేస్తుంది.

పైనాపిల్  : పాలకూర తర్వాత ఆక్సిజన్ రిచ్ ఫుడ్స్‌లో పైనాపిల్ ఒకటి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లతో పాటు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

మామిడి  : కాలేయం ఆరోగ్యానికి మామిడి ఔషధంగా పనిచేస్తుంది. అధిక రక్త పోటును తగ్గించి, రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. మామిడి పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

బీట్‌రూట్ : బీట్‌రూట్‌లో నైట్రిక్ ఆక్సైడ్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. రక్త ప్రసరణ పెంచడంతో పాటు ఆక్సిజన్ శరీరానికి  సరిగ్గా అందేలా చేస్తుంది. కండరాల బలానికి దోహదపడుతుంది.

కందగడ్డలు : విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కందగడ్డల్లో ఉంటాయి. ఇవి ధమనుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. హృదయ సంబంధిత వ్యాధులను తగ్గిస్తాయి.