calender_icon.png 6 May, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెంచిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి : సీఐటీయు

10-04-2025 02:02:37 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ఇల్లెందు పట్టణం కూరగాయల మార్కెట్(Yellandu Town Vegetable Market) వద్ద సీఐటీయూ  ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ కన్వీనర్ తాళ్లూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నదని అన్నారు.

ప్రపంచ దేశాలలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే మన దగ్గర గ్యాస్ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ఏమిటని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని విమర్శించారు. ఒకవైపు ప్రభుత్వం నిత్యావసర వస్తువులపై విపరీతంగా ధరలు పెంచుతున్న పాలకులు పట్టించుకోవడం లేదని, మరో వైపు ప్రత్యక్ష, పరోక్ష పన్నులులు అసాధారణంగా పెంచుకుంటూ పోతున్నాయని, ఈ విధానాలకు వ్యతిరేకంగంగా ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు.