6 June, 2026 | 2:36 AM

పచ్చదనాన్ని పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత

06-06-2026 12:42 AM

వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్

నల్గొండ టౌన్ జూన్ 5: పచ్చదనాన్ని పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ఖజా అల్తాఫ్ హుసేన్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా శుక్రవారం యూనివర్సిటీలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్బంగా వీసీ మాట్లాడుతూ ప్రకృతి ఒడిలో, జీవవైవిధ్యంతో మన జీవన విధానాన్ని సమన్వయపరచుకోవడం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరి బాధ్యత అవుతుందన్నారు. వాతావరణ మార్పు , గ్లోబల్ వార్మింగ్ సమస్యలను ఎదుర్కోవడానికి వృద్ధి చెందుతున్న  పట్టణీకరణ, హానికర ఉత్పత్తుల వినియోగం తగ్గించడం, పోషక వనరుల సంరక్షణ వృక్షారోపణ ముఖ్యమని ఆయన గుర్తుచేశారు. పర్యావరణoతో సహజీవనం అవసరమని, ప్రకృతిని సంరక్షించడం అన్ని తరాల కలిసిన బాధ్యత అన్నారు.

మొక్కలు నాటడంతో పాటు భూమి సంరక్షణ, అవగాహన కార్యక్రమాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధిం చేందుకు యూనివర్శిటీ తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి ఒక్కరి సహకారం ద్వారా పరిసరాల పరిరక్షణ సాధ్యమని, అనవసర కాలుష్యాన్ని తగ్గించేందుకు రోజువారీ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద మార్పులకు దారితీస్తాయని పేర్కొన్నారు.

అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ మారం వెంకటరమణారెడ్డి, డిఆర్డిఓ పిడి, శేఖర్ రెడ్డి, అటవీ శాఖ అధికారులు డిఎఫ్‌ఓ రాజశేఖర్ ఐ ఎఫ్ ఎస్, వై శ్రీనివాస్ వీరేంద్రబాబు, రవీందర్, మల్లేష్ సౌజన్యా, కాలుష్య నియంత్రణ మండలి అధికారి శంకర్ బాబు, ఎన్ ఎస్ ఎస్  పి ఓ లు, జీడిమెట్ల రవీందర్, తదితరులు పాల్గొన్నారు.