ఢిల్లీలో హైటెన్షన్.. ఎంపీల ర్యాలీ!

06-10-2026 | 11:14am

ఢిల్లీలో (Delhi) ఇండి కూటమి ఎంపీల (INDI Alliance MPs) ర్యాలీతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్లమెంట్‌ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కార్యాలయం వరకు ఎంపీలు ర్యాలీ చేపట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌ కుమార్‌ను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు.ఎంపీల ర్యాలీ నేపథ్యంలో పోలీసులు (Delhi Police) అప్రమత్తమయ్యారు. పార్లమెంట్‌ నుంచి ఈసీ కార్యాలయం వరకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సెంట్రల్ ఢిల్లీలో (Central Delhi) పలు రహదారులను మూసివేసి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ఇవి కూడా చదవండి:  స్టేషనరీ పేరుతో బాణాసంచా స్మగ్లింగ్!

భద్రతా చర్యల్లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు (Internet Services) నిలిచిపోయినట్లు సమాచారం. మొబైల్ డేటా (Mobile Data) సేవలు కూడా పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ర్యాలీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు