ప్రపంచ పరిష్కారాల హబ్‌గా భారత్

12-09-2026 | 05:05am
  1. నౌకాస్వేచ్ఛ, నావికుల భద్రతతోనే ప్రపంచ వాణిజ్యం వృద్ధి
  2.   10 వాణిజ్య ఆటంకాల చెక్‌కు నివేదిక సిద్ధం చేయాలి
  3. వరల్డ్‌లో వాణిజ్య అవరోధాలు పెరుగుతోంటే..
  4. భారత్ ఆర్థిక వారధులను నిర్మిస్తోంది
  5. బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్‌(BRICS Business Forum)లో ప్రధాని నరేంద్ర మోదీ
  6. ప్రపంచ ఇంధన, ఆహార భద్రతకు రష్యా రెడీ
  7. వ్లాదిమిర్ పుతిన్ స్పష్టీకరణ
  8. బ్రిక్స్‌లో జాతీయ కరెన్సీలను విస్తరించాలి: ఇరాన్ అధ్యక్షుడు 

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: ప్రపంచ పరిష్కారాల హబ్‌గా భారత దేశం(India) మారుతోందని ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అన్నారు. నౌకాస్వేచ్ఛ, నావికుల భద్రతతోనే ప్రపంచ వాణిజ్యం వృద్ధి(Growth of global trade) చెందుతుందని, 10 వాణిజ్యానికి ఎదురవుతున్న ఆటంకాల కు చెక్ పెట్టేందకు ఒక నివేదిక సిద్ధం చేయాలని బ్రిక్స్‌ను మోదీ కోరారు. వరల్డ్ వ్యాప్తంగా వాణిజ్య అవరోధాలు పెరుగుతోంటే..భారత దేశం మాత్రం ఆర్థిక వారధులను నిర్మి స్తోందని స్పష్టం చేశారు.

ఏటా 100 బ్రిక్స్ స్టార్టప్‌లు అభివృద్ధి చేయాలని, 1,000 కొత్త వాణిజ్య భాగస్వామ్యాలే లక్ష్యం కావాలని బ్రిక్స్‌కు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అలాగే ప్రపంచ ఇంధన, ఆహార భద్రత(food security)కు సహకరించడానికి, ఆర్కిటిక్, ఉత్తర-దక్షిణ లాజిస్టిక్ రవాణా కారి డార్‌లను నిర్మించేందకు రష్యా సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) స్పష్టంగా వెల్లడించారు. పశ్చిమాసియా అనిశ్చతులతో దునియా అత్యంత క్లిష్టమైన కాలాన్ని ఎదుర్కొంటోందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ వెల్లడించారు.

బ్రిక్స్ దేశాల మధ్య వాణి జ్యాలకు జాతీయ కరెన్సీలను విస్తరించాలని బ్రిక్స్‌ను కోరారు. న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ప్రపంచ వాణిజ్యాన్ని ప్రోత్సహించడా నికి నౌకాస్వేచ్ఛ, నావికుల భద్రత అవసరమని పిలుపునిచ్చారు. సురక్షితమైన సముద్ర మార్గాల ద్వారానే, నావికుల ప్రాణాలకు రక్షణ ఉంటేనే ప్రపంచ వాణిజ్యం వృద్ధి చెందుతుంది అన్నారు.

అందుకే నౌకా స్వేచ్ఛకు, నావికుల భద్రతకు భారతదేశం గట్టి మద్దతుదారుగా ఉందని మోదీ స్పష్టం చేశారు. 2 లక్షలకు పైగా నమోదైన స్టార్టప్‌లు, 120 యూని కార్న్‌లతో భారతదేశం ప్రపంచ పరిష్కారాల కేంద్రంగా మారుతోందని పేర్కొన్నారు. ప్రపంచ అనిశ్చితుల మధ్య, వృద్ధికి, స్థిరత్వానికి భారత్ ఒక విశ్వాసానికి మూలంగా ఉందని తెలిపారు. 

ప్రపంచవ్యా ప్తంగా వాణిజ్య అవరోధాలు పెరుగుతున్న తరుణంలో, భారత్ మాత్రం ఆర్థిక వారధులను నిర్మిస్తోందని మోద స్పష్టం చేశారు. 10 వాణిజ్య అవరోధాలను తొలగించడంపై ఒక నివేదికను సిద్ధం చేయాలని, అలాగే ప్రతి సంవత్సరం 100 బ్రిక్స్ స్టార్టప్‌లు అభివృద్ధి చెందడానికి మద్దతు ఇవ్వాలని ఆయన బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్‌ను కోరారు. వెయ్యి వ్యాపార కొత్త భాగస్వామ్యాలను అభివృద్ధి చేయాలని కూడా అభ్యర్థించారు. ఈ అంశాలపై ప్రతేటా సమీక్షించుకోవాలన్నారు. 

ఈ వేదికపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ మాట్లాడుతూ.. ప్రపంచం భౌగోళిక రాజకీయ అనిశ్చితులతో కూడిన అత్యంత క్లిష్టమైన కాలాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య వాణిజ్యంలో జాతీయ కరెన్సీల వినియోగాన్ని విస్తరించాలన్నారు. బ్రిక్స్ మధ్య వాణిజ్యాన్ని పెంచడానికి, మనం విచ్ఛిన్నమైన సహకారం నుంచి వాణిజ్య మౌలిక సదుపాయాల ఏకీకరణ వైపు పయనించాలని స్పష్టం చేశారు. 

ప్రపంచ ఇంధన, ఆహార భద్రతకు రష్యా సిద్ధం: పుతిన్ 

ప్రపంచ ఇంధన, ఆహార భద్రతకు సహకరించేందుకు రష్యా సిద్ధంగా ఉందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. బ్రిక్స్ దేశాలకు చైతన్యవంతమైన, శక్తివంతమైన దేశీయ మార్కెట్లు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో ప్రసంగిస్తూ, ప్రపంచం నిర్మాణాత్మక, లోతైన, ప్రగాఢమైన మార్పులకు లోనవుతోందని పుతిన్ తెలిపారు. పర్యాటకం, పరిశ్రమ, వాణిజ్యం వంటి రంగాలలో ఆసక్తికరమైన, ఆశాజనకమైన కార్యక్రమాలకు రష్యా రెడీగా ఉందని కూడా పేర్కొన్నారు.

‘మా భాగస్వాములతో కలిసి, ప్రపంచ ఇంధన, ఆహార భద్రతకు, ఆర్కిటిక్ రవాణా కారిడార్, ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ వంటి నమ్మకమైన లాజిస్టిక్ మార్గాల నిర్మాణానికి సహకరిం చడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు. కొనసాగుతున్న రష్యా--ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యం లో.. అమెరికా లేదా మరే ఇతర దేశం పేరును నేరుగా ప్రస్తావించకుండా, పుతిన్ పాశ్చాత్య దేశాలపై విమర్శలు చేశారు.

మరిన్ని వార్తలు