29 June, 2026 | 2:12 AM

పీవీ ఆర్థిక సంస్కరణ వల్లే భారత్ పురోగతి

29-06-2026 01:28 AM

ఆయన స్వగ్రామంలో ఘనంగా జయంతి 

భీమదేవరపల్లి, జూన్ 28 (విజయక్రాంతి): స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణ వల్లనే భారత్ నేడు ప్రపంచ మార్కెట్‌ను శాసిస్తున్నదని వక్తలు కొనియాడారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం పీవీ స్వగ్రామమైన వంగరలో భారతరత్న పీవీ 105 జయంతి వేడుకలు ఆయన స్వగృహంలో జరిగాయి.

పీవీ విగ్రహానికి కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, పీవీ కుటుంబ సభ్యులు పీవీ మదన్మోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పీవీ నరసింహారావు చిన్న గ్రామంలో పుట్టి విద్యను అభ్యసించి మహావృక్షంగా ఎదిగారని కొనియాడారు. ఆయన్ని బహుభాషా కోవిదుడుగా ప్రపంచంలోని అన్ని దేశాలు గుర్తించినారన్నారు. పార్టీలకు మతాలకు అతీతంగా పీవీని స్మరించుకోవాలన్నారు. పీవీ బాటలో ప్రతి ఒక్కరు నడవాల్సిన అవసరం ఉందన్నారు.

కార్యక్రమంలో వంగర సర్పంచ్ సృజన, అశోక్ ముఖర్జీ, ఆదరి రవీందర్, రాజిరెడ్డి, చిదురాల స్వరూప ఊస కోయిల ప్రకాష్, చిట్టి సతీష్ రెడ్డి, జిమ్మల భీమ్ రెడ్డి, తిరుపతిరెడ్డి, రఘు నాయకుల వెంకటరెడ్డి, మేఘన స్వచ్ఛంద సంస్థ సామాజిక సేవకురాలు సుహాసిని, జక్కుల అనిల్, మర్రి దేవరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ స్రవంతి, చివ్వాలా బుచ్చయ్య, సీఐ పులి రమేష్, ఎస్‌ఐ దివ్య, విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు.