30 March, 2026 | 4:14 AM

IND vs NZ 3rd Test: కష్టాల్లో టీమిండియా

03-11-2024 10:45 AM

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న భారత్ వర్సెస్ న్యూజిలాండ్ 3వ టెస్టు మ్యాచులో టీమిండియా కష్టాల్లో పడింది. లక్ష్యఛేధనలో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. రెండో ఇన్నింగ్స్ లో 18 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన భారత్ 29 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ(11), శుభ్‌మన్ గిల్‌(1), విరాట్ కోహ్లీ(1), జైస్వాల్(05), సర్ఫరాజ్(1) ఔట్ అయ్యారు. మూడో టెస్టు మ్యాచులో లక్ష్యానికి భారత్ 117 పరుగుల దూరంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్(11), జడేజా(09) పరుగులతో ఆడుతున్నారు.