14 April, 2026 | 1:40 PM

భారత మహిళలను ఆపతరమా?

28-12-2025 12:00 AM

నేడు శ్రీలంకతో నాలుగో టీ20

తిరువనంతపురం, డిసెంబర్ 27 : సొంతగడ్డపై దుమ్మురేపుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో నాలుగో టీ20కి రెడీ అయింది. ఇప్పటికే 3 సిరీస్ కైవసం చేసుకున్న భారత్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. బ్యా టర్లు, బౌలర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్  మాత్రం ఇంకా తమదైన ఇన్నింగ్స్‌లు ఆడలేదు. ఈ సిరీస్ ఆరంభం నుంచీ స్మృతిపై అంచనాలు ఎక్కువగానే ఉన్నా ఆమె నిరాశపరుస్తోంది.

అటు షెఫాలీ వర్మ మాత్రం తన ధనాధన్ మెరుపులతో అదరగొడుతోంది. బౌలింగ్‌లో రేణుకాసింగ్‌తో పాటు దీప్తి శర్మ , వైష్ణవి శర్మ కూడా అదరగొడుతున్నారు. శ్రీలంక బ్యాటర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. భారత ఆల్‌రౌండ్ షోతో ఇప్పటి వరకూ జరిగిన మూడు మ్యాచ్‌లూ వన్‌సైడ్‌గానే ముగిసిపోయాయి. దీంతో నాలుగో టీ20లోనైనా శ్రీలంక మహిళల జట్టు పోటీ ఇస్తుందా అనేది చూడాలి.