25 May, 2026 | 1:05 AM

నౌకాయాన వాణిజ్యానికి ప్రాధాన్యం

25-05-2026 12:00 AM

అంతరాయం లేని రవాణా వ్యవస్థను కోరుకుంటున్నాం

‘మేక్ ఇన్ ఇండియా’కు కట్టుబడి ఇతర దేశాలతో భాగస్వామ్యం 

భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ స్పష్టీకరణ

ఢిల్లీలో అమెరికా విదేశాంగ మంత్రి రుబియోతో భేటీ

న్యూఢిల్లీ, మే ౨౪: అంతరాయాలు లేని నౌకాయాన వాణిజ్యానికి భారత్ ప్రాధాన్యమిస్తుందని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. ‘మేక్ ఇన్ ఇండియా’ను బలోపేతం చేసేలా గ్లోబల్ భాగస్వామ్య విధానాన్ని అవలంబిస్తామని వెల్లడించారు. ఆదివారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ వేదికగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియోతో ఆయన భేటీ అయ్యారు.

ఇద్దరూ కొన్ని గంటలపాటు ఇరు ద్వైపాక్షిక, రక్షణ, ఇంధన భద్రత, సాంకేతికత, వీసాలు, సరిహద్దు ఉగ్రవాదం, వాణి జ్య సంబంధాలపై చర్చించారు. అనంతరం జైశంకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రపంచ దేశాల్లో ఉద్రిక్తతలు, అంత ర్జాతీయ శాంతి స్థాపనకు ఆయన ఐదు సూ త్రాలు ప్రతిపాదించారు. దేశాల మధ్య ఏవైనా వివాదాలు తలెత్తితే చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ మొదటి నుంచి కోరుకుంటున్నదని ఉద్ఘాటించారు. సముద్ర జలాల్లో సురక్షితమైన, అంతరాయం లేని వాణిజ్యానికి తా ము ప్రాధాన్యమిస్తామని తెలిపారు. అంతర్జాతీయ చట్టాలను ప్రతి దేశమూ పాటిం చాలని అభిప్రాయపడ్డారు.

ప్రపంచ మార్కె ట్ వాటా, వనరులను కొన్ని దేశాలు తమ స్వార్థం కోసం ఆయుధాలుగా మార్చుకోవడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కుండబద్దలు కొట్టారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు నమ్మ కమైన భాగస్వామ్య దేశాలను ఎంచుకుంటామని వివరించారు. ఇంధన ధరల నియం త్రించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వీసాల విషయంలో అమెరికా అమలు చేస్తు న్న విధానాలు, భారత్ నుంచి వలసలకు ఇబ్బందికరంగా ఉండకూడదని ప్రతిపాదించారు.

కీలక భాగస్వామి భారత్: రుబియో

వాణిజ్యంలో భారత్‌కు తమకు కీలక భాగస్వామి అని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం ఉన్న అతికొది దేశాల్లో భారత్ ఒకటని కొనియాడారు. తమ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను సంస్కరించే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావొచ్చని, వలస వచ్చే వారికీ కొన్ని ఆటంకాలు ఏర్పడతాయని కుండబద్దలు కొట్టారు. అయితే.. వాటిని తమ దేశ సంస్కరణల్లో భాగంగానే చూడాలని కోరారు. పటిష్టమైన ఇమ్మిగ్రేషన్ విధా నం అమలులోకి వస్తే.. అది అన్నిదేశాలకూ శ్రేయస్కరమని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య త్వరలోనే పరస్పర ప్రయోజనకరమైన, దీర్ఘకాలిక వాణిజ్య ఒప్పందాలు కుదురుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారతీయ కంపెనీలు ఇప్పటివరకు 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయని, ఈ భాగస్వా మ్యం మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా వలసదారు లకు మిత్రదేశమని మార్కో రూబియో బలంగా చెప్పారు. అగ్రరాజ్యంలో భారతీయులపై వివక్ష చూపడం మూర్ఖులు చేసే పని అంటూ పేర్కొన్నారు. ప్రతి దేశంలో మూర్ఖులు ఉంటారని.. వారు దేశ ఔన్నత్యాన్ని కాపాడలేరు సరికదా.. మరింత దిగజారుస్తారని చెప్పుకొచ్చారు. కొంతకాలం నుంచి భారత్, అమెరికా మధ్య కాస్త గ్యాప్ వచ్చిందనే వాదనలను ఆయన తోసిపుచ్చారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారతీ యులు 20 బిలియన్ డాలర్ల వరకు ఆదాయమిస్తున్న విషయాన్ని తాను అంగీకరిస్తా నని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆ మొత్తం ఇంకా పెరగాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.