4 May, 2026 | 12:25 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

క్వార్టర్స్ కు చేరిన భారత మహిళా ఆర్చరీ జట్టు

25-07-2024 06:38 PM

పారిస్ ఒలింపిక్స్ క్వార్టర్స్ కు భారత మహిళా ఆర్చరీ జట్టు చేరింది. మహిళల ర్యాంకింగ్ రౌండ్ లో మహిళా ఆర్చరీ జట్టు మంచి స్కోర్ చేయడంతో భారత్ నాలుగోస్థానానికి చేరింది. భారత మహిళా ఆర్చరీ జట్టులో అంకిత భకత్, దీపికా కుమారి, భజన్ కౌర్  కలిసి  1983 పాయింట్లు స్కోర్ సాధించారు. ఈ పారిస్ ఒలింపిక్స్ లో దక్షిణకొరియా 2046 పాయింట్లుతో 1వ స్థానంలో నిలువగా, చైనా 1996 పాయింట్లు సాధించి 2వ స్థానం, 3వ స్థానలో మెక్సికో 1986 పాయింట్లు సాధించింది. అంకిత భకత్ 666 పాయింట్లతో 11వ స్థానంలో నిలువగా, దీపికా కుమారి 658 పాయింట్లు సాధించి 22వ స్థానం, భజన్ కౌర్ 659 పాయింట్లు సాధించి 23వ స్థానంలో నిలిచారు. క్వార్టర్ ఫైనల్స్ లో ఫ్రాన్స్ లేదా నెదర్లాండ్ తో జూలై 28వ తేదీన భారత్ పోటీ పడనుంది. ఇక  క్వార్టర్ ఫైనల్స్ లో భారత్ విజయం సాధిస్తే సెమీఫైనల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియాతో పోటీ పడే అవకాశం ఉంటుంది.