14 August, 2026 | 5:27 PM

నీటి నిల్వకుంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్

14-08-2026 04:28 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): పరిగెత్తే నీటికి.... నడక నేర్పాలి... నడిచే నీటికి  నిలకడ నేర్పాలి.. అనే నాడు స్ఫూర్తితో  జిల్లా యంత్రాంగం గ్రామాల్లో నీటి నిల్వ కుంటలు, పంట కుంట పనులు ముమ్మరంగా చేపట్టారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ పంచాయతీ పరిధిలో చేపట్టిన నీటి నిలవకుంటల పనులను  జిల్లా కలెక్టర్ రాజర్శి షా, ఐటీడీఏ పీవో  మంద మకరందు  లు క్షేత్రస్థాయిలో శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ.. ప్రతి రైతు చేనులో నీటి నిలువ కుంటలను  నిర్మించుకునేందుకు  ప్రభుత్వం 90 వేల నుండి  1.30 లక్షల రూపాయలు అందిస్తుందని  గుర్తు చేశారు.

ప్రతి రైతు తనకు చేనులో  నీటి కుంట నిర్మించుకుంటే  వ్యవసాయ పనులతో పాటు  ఇతర సౌఖ్యారాలకు  ఎంతో గాను ఉపయోగపడంతో పాటు  వర్షపు నీటిని భూగర్భ జలంలో  పొదుపు చేసుకునే అవకాశం ఉందని  రైతులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన  జలసిరి పథకాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచనలు చేశారు.

నీటి నిల్వ కుంటలను  వ్యవసాయ చేనులో నిర్మించుకుంటే కూలీలకు సైతం ఉపాధి సౌకర్యం కలుగుతుందని కలెక్టర్ అన్నారు. సాగు భూమిలో నీటి నిలువ కుంటలు నిర్మించుకుంటే  బోరు బావుల్లో నీటిమట్టం సైతం పెరుగుతుందని  ఈ సందర్భంగా రైతులకు అవగాహన కల్పించారు. ఆయనతోపాటు  డి ఆర్ డి ఓ పి డి  రవీందర్ రాథోడ్, ఎంపీడీవో మహేందర్, తహసిల్దార్  ప్రవీణ్ కుమార్, సర్పంచ్ తుకారాం  ల తో పాటు ఉపాధి హామీ అధికారులు, రైతులు పాల్గొన్నారు.