నష్టాల్లో ముగిసిన సూచీలు
* 23,700 దిగువకు నిఫ్టీ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలుబుధవారం నష్టాల్లో ముగిశాయి. అమెరికా- చైనా మధ్య నెలకొ న్న వాణిజ్య యుద్ధ భయాలు, అధిక వెయిటేజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలను పడేశాయి. దీంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మానిటరీ పాలసీ కమిటీ నిర్ణ యాలు శుక్రవారం వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తుండడం సూచీలు నష్టాలకు కారణమయ్యాయి.
నిఫ్టీ 23,700 దిగువన ముగిసింది.సెన్సెక్స్ ఉద యం 78,704.60 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. తర్వాత నష్టాల్లోకి జారుకున్న సూచీ.. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఆఖర్‌లో మరింత ఆమ్మకాల ఒత్తిడితో 312.53 పాయింట్ల నష్టంతో 78,271.28 వద్ద ముగిసింది. నిఫ్టీ 42.95 పాయింట్ల నష్టంతో 23,696.30 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ మరో 39 పైసలు క్షీణించి 87.46 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని తాకింది.
సెన్సెక్స్ 30 సూచీలో ఏషియన్ పెయింట్స్, టైటాన్, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 75.53 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2896 డాలర్ల స్థాయి వద్ద ట్రేడవుతోంది.






