రూ. 799 కోట్లకు పెరిగిన స్విగ్గీ నష్టం
న్యూఢిల్లీ: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ బుధవారం త్రైమాసిక ఫలితా లను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ప్లాట్‌ఫామ్ నష్టం రూ.799 కోట్లుగా నమోదైందని కంపెనీ తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమో దైన రూ.574 కోట్లతో పోలిస్తే నష్టం 39 శాతం పెరిగినట్లు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
కార్యకలాపాల నుంచి వచ్చే ఆదా యం 31 శాతం వృద్ధితో రూ.3,049 కోట్ల నుంచి రూ.3,993 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది.తమ సేవలను మరింత విస్తరించడంలో భాగంగా బోల్ట్, స్నాక్ పేరిట 10 నిమిషాల డెలివరీ సేవల్ని ప్రారంభించామని కంపెనీ సీఈఓ శ్రీహర్ష మజేటీ అన్నా రు. వీటితో పాటు రెస్టారెంట్, ఈవెంట్ రిజర్వేషన్ల కోసం స్విగ్గీ సెన్సస్, స్విగ్గీ ప్రీమియం సేవల కోసం వన్ బ్లాక్ సబ్‌స్క్క్రిప్షన్ ప్రోగ్రామ్ తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు.
ఫుడ్ డెలివరీ విభాగం ద్వారా వచ్చిన ఆదాయాన్ని క్విక్ కామర్స్ వ్యాపార విస్తరణకు, మార్కెటింగ్‌ల్తో వినియోగించినట్లు తెలిపారు. ఒక్క జనవరిలోనే 86 ఇన్‌స్ట్టామార్ట్ స్టోర్లను జోడించినట్లు ఆయన తెలిపారు. ఫలితాల నేపథ్యంలో మార్కెట్ ముగిసే సమయానికి స్విగ్గీ షేరు విలువ 3.56 శాతం నష్టంతో రూ.418.60 వద్ద ముగిసింది.






