4 September, 2026 | 3:01 PM

ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అందజేత

04-09-2026 | 01:46pm

బోధన్, సెప్టెంబర్ 04 (విజయ క్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల(Indiramma's housed) పథకంలో భాగంగా బోధన్ (Bodhan)పట్టణంలోని 10వ వార్డులో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. లబ్ధిదారుల ఇంటి వద్ద ఇందిరమ్మ ముగ్గు వేసి, అర్హత పొందిన లబ్ధిదారుల(Beneficiaries)కు ఇంటి పట్టాలను అందజేశారు.

ఈ సందర్భంగా25 వార్డ్ మెంబర్ వార్డు మెంబర్ తుమ్ శారత్ రెడ్డి  మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో లబ్ధిదారులు ఆత్మగౌరవంతో సొంత ఇళ్లను నిర్మించుకోవాలని ఆకాంక్షించారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమ సొంతింటి కల(dream home)నెరవేరుతున్నందుకు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ తూము శరత్ రెడ్డి, టౌన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అన్నవరం విష్ణువర్ధన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తల్లారి నవీన్, కౌన్సిలర్ జహీర్ ఉద్దీన్, శంకర్, మాజీ కౌన్సిలర్లు శ్రీకాంత్ గౌడ్, ఇమ్రాన్, ఏయ్ జయంత్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వార్డు నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.