1 September, 2026 | 9:46 PM

ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభం

01-09-2026 | 07:04pm

నిర్మల్,(విజయక్రాంతి): లక్ష్మణ చందా మండలంలోని కనకాపూర్ గ్రామంలో(kanakapur village) నూతనంగా నూతనంగా నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులను నిర్మల్ మార్కెట్ కమిటీ(Nirmal Market Committee) అధ్యక్షులు సోమ భీమారెడ్డి ప్రారంభించారు. ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు(Indiramma house) నిర్మించి ఇస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇందిరమ్మ లబ్ధిదారులకు 5 లక్షల సాయం అందిస్తుందన్నారు.

ఇల్లు మంజూరైన వారు వెంటనే ఇంటి నిర్మాణం పనులను ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ చందా కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధ్యక్షులు కొండ్ర నరేష్ రెడ్డి ఆత్మ చైర్మన్ రామ్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి కనకాపూర్ సర్పంచ్ రాజ్యలక్ష్మి రాజు నిర్మల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్ ఉప సర్పంచ్ డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాకేష్ ప్రమోద్ కప్ప కంటి మోహన్ మల్లికార్జున్ రమేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.