ఆవు దొంగకు రిమాండ్
ఉట్నూర్,(విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని భీమ్ నగర్ కు చెందిన ఆచార్య సులోచన అబ్బాయికి చెందిన 50వేల విలువ చేసే ఆవును దొంగలించిన దొంగలు 24 గంటల్లో పోలీసులు పట్టుకొని కేసు రిమాండ్ కు పంపినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం సులోచన భాయ్ తన ఆవును ఇంటి పక్క ఆదివారం రాత్రి కట్టేసి పడుకుంది. సోమవారం తెల్లవారుజామున ఆవు కోసం చూడగా ఆవు కనిపించలేదు.
పాలిచ్చే ఆవు కల్పించకపోవడంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకుని ఎస్ఐ ఆవు దొంగలతో పాటు ఆవు కోసం పోలీసులను పంపించారు. నార్నూర్ మండలంలోని సోనాపూర్ గ్రామానికి చెందిన భానోత్ రామేశ్వర్ దొంగలించినట్లు గుర్తించారు. ఆవు దొంగను తీసుకువచ్చి పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఆవు దొంగను మంగళవారం కోర్టుకు హాజరు పరచగా ఉట్నూర్ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.






