1 September, 2026 | 10:14 PM

Breaking News

భూ రీ సర్వేను నిలిపివేయాలని గ్రామస్తుల ధర్నా   •   ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి   •   అశ్వాపురం రైస్‌మిల్‌ యజమాని అరెస్ట్‌   •   రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు చక్కెర కిరోసిన్ పంపిణీ చేయాలి   •   కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతుం కేంద్ర ప్రభుత్వం   •   22ఏ భూముల వివరాలు పక్కాగా సిద్ధం చేయాలి   •   సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి   •   ఓపీఎస్‌ కోసం ఉద్యోగుల గళం.. నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   కరీంనగర్ జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నల్లగొండ తిరుపతి గౌడ్ నియామకం   •   ఉద్యోగులకు పాత పెన్షన్ విదానాన్ని అమలు చేయాలి   •  

చర్లలో 48 గంటల రిలే దీక్షలు ప్రారంభం

01-09-2026 | 09:44pm

చర్ల,(విజయక్రాంతి): ఏజెన్సీలో ఆదివాసీ మహిళలపై(Tribal women) జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ గోండ్వానా సంక్షేమ పరిషత్(Gondwana Welfare Council) ఆధ్వర్యంలో 48 గంటల రిలే దీక్షలు మంగళవారం  ప్రారంభమయ్యాయి.  చర్ల మండల కేంద్రంలోని కొమరం భీం విగ్రహం(Komaram Bheem statue) వద్ద ఉభయ రాష్ట్రాల కన్వీనర్ సొందే వీరయ్య దీక్షలను ప్రారంభించారు. అంతకు ముందు ఉయక శిరీషకు నివాళిగా మౌనం పాటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ మహిళలే లక్ష్యంగా అత్యాచారాలు జరుగుతున్నాయని, దోషులపై కఠిన చట్టాలు తేవాలన్నారు. ఏజెన్సీ చట్టాల పరిరక్షణకు యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు బీరబోయిన శేఖర్, నాయకులు గొంది లీలాప్రసాద్, బీరబోయిన అరుణ, ఇరప అంజిబాబు, కాయం శ్రీనివాసరావు, పాయం సన్యాసి, ముమ్మినేని అరవింద్, సిహెచ్. రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.