01-12-2024 01:46:33 AM
టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు
హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏల ను విడుదల చేయాలని ప్రభుత్వానికి టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్‌రావు విజ్ఞ ప్తి చేశారు. తెలంగాణ గెజిటెడ్ అధికారు(టీజీవో)ల కేంద్ర సంఘం కార్యవర్గ సమావేశం శనివారం నాంపల్లిలోని టీజీవో భవన్‌లో జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం, ఉద్యోగుల కాంట్రిబ్యూ షన్ సమాన నిష్పత్తిలో చేసి ఉద్యోగుల ఆరో గ్య పథకంను అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీంను పున రుద్ధరించాలని తెలిపారు.
పదవీ విరమణ పొందిన అధికారులు, ఉద్యోగుల సర్వీసు పొడిగించ వద్దన్నారు. సమావేశంలో తీర్మానించిన వినతిపత్రాన్ని సీఎస్‌కు, మంత్రివర్గ ఉపసంఘానికి అందజేయాలని నిర్ణయించినట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.