17 June, 2026 | 2:47 AM

అంగన్వాడీలో అక్షరాభ్యాసం

17-06-2026 01:50 AM

జనగామ, జూన్ 16 (విజయక్రాంతి): నర్మెట్ట మండల కేంద్రంలోని అంగన్వాడీ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమంలో నర్మెట్ట సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి వారి విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ.. చిన్నారుల జీవితంలో అక్షరా భ్యాసం ఎంతో కీలకమైన ఘట్టమని అన్నా రు.

విద్యతోనే వ్యక్తిత్వ వికాసం, సమాజ అభివృద్ధి సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ప్రతి చిన్నారి ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆ కాంక్షించారు. అనంతరం చిన్నారులకు ఆశీర్వాదాలు అందించి, తల్లిదండ్రులు తమ పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూ చించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొలేపాక స్వామి, ఆగపేట సర్పంచ్ రాజు, వార్డు మెంబర్లు యాదగిరి, ఐసిఓఎస్ సూపర్వైజర్ శృతి,  అంగన్వాడి టీచర్లు రజిత కుమారి, సృజన, శోభదేవి తదితరులు పాల్గొన్నారు.